

తెలంగాణ సమగ్ర ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కీలక పాత్ర పోషిస్తోందని గవర్నర్ శివ ప్రసాద్ శుక్లా పేర్కొన్నారు. గురువారం లోక్‌భవన్‌లో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వార్షిక నివేదికను ఆయన ఆవిష్కరించారు. రైతులు, మహిళలు, స్వయం సహాయక సంఘాలు, గ్రామీణ ప్రజలకు నాణ్యమైన బ్యాంకింగ్ సేవలు అందిస్తూ దేశంలోనే అత్యుత్తమ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఒకటిగా ఈ సంస్థ గుర్తింపు పొందిందని ఆయన తెలిపారు.
2025–26 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ రూ.1,902.23 కోట్ల ఆపరేటింగ్ లాభం, రూ.1,282.84 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. మార్చి 31, 2026 నాటికి మొత్తం వ్యాపారం రూ.81,152.50 కోట్లకు చేరుకోగా, 26.24 శాతం మూలధన సమృద్ధి నిష్పత్తి, సున్నా శాతం నికర నిరర్థక ఆస్తులు (నెట్ ఎన్‌పీఏ)తో విశేష పనితీరు కనబరిచింది. రాష్ట్రవ్యాప్తంగా 939 శాఖల ద్వారా 90 లక్షలకుపైగా ఖాతాదారులకు సేవలందిస్తున్న బ్యాంక్ గ్రామీణాభివృద్ధిలో మరింత కీలక పాత్ర పోషించాలని గవర్నర్ ఆకాంక్షించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!