

2027 ఐపీఎల్ సీజన్‌కు ముందు ముంబయి ఇండియన్స్‌తో హార్దిక్ పాండ్య బంధం ముగిసినట్లు తెలుస్తోంది. కీలక ఆటగాళ్ల ట్రేడ్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్ హార్దిక్‌ను రూ.18 కోట్లకు దక్కించుకోగా, అతడికి బదులుగా ముంబయి ఇండియన్స్ అర్ష్‌దీప్ సింగ్‌ను తమ జట్టులోకి తీసుకుంది. ఈ ట్రేడ్‌ను ఐపీఎల్ యాజమాన్యం బుధవారం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం హార్దిక్‌కు రూ.16.35 కోట్ల ఫీజు ఉండగా, ఈ ఒప్పందంతో అది రూ.18 కోట్లకు పెరిగింది. మరోవైపు అర్ష్‌దీప్‌ను కూడా ఎలాంటి మార్పు లేకుండా అతడి ప్రస్తుత ధర రూ.18 కోట్లకే ముంబయి దక్కించుకుంది. గతంలో ముంబయి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్.. పంజాబ్‌లో శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఆడనున్నాడు.
2015లో ముంబయి ఇండియన్స్‌లో చేరిన హార్దిక్ పాండ్య.. ఆ జట్టు నాలుగు టైటిళ్లు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2022 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వెళ్లి, తొలి సీజన్‌లోనే ఆ జట్టుకు టైటిల్ అందించాడు. 2024 సీజన్‌కు ముందు తిరిగి ముంబయికి చేరి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినా, అతడి నాయకత్వంలో జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 162 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ 146.28 స్ట్రయిక్ రేటుతో 2,955 పరుగులు చేసి, 82 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు పంజాబ్ తరఫునే ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అర్ష్‌దీప్ ఎనిమిదేళ్ల పాటు ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 96 మ్యాచ్‌ల్లో 111 వికెట్లు తీసి పంజాబ్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. అర్ష్‌దీప్‌ను వదులుకోవడానికి పంజాబ్ ఆసక్తి చూపకపోయినా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కోచ్ రికీ పాంటింగ్‌తో జరిగిన చర్చల అనంతరం ఈ ట్రేడ్‌కు అంగీకరించినట్లు సమాచారం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!