
జనరల్

ఎంఎస్ ధోనీ ఐపీఎల్ కెరీర్ ముగింపుకు చేరువలో ఉన్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ ఈరోజు తమ హోం గ్రౌండ్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. పూర్తి ఫిట్నెస్ సాధించిన ధోనీ ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశముందని సమాచారం. దీంతో అభిమానులు ఆయనను మైదానంలో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ధోనీ గతంలో “నా చివరి టీ20 మ్యాచ్ చెన్నైలోనే ఆడతా” అని చెప్పిన పాత వీడియోను అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు. ఈ మ్యాచ్ ధోనీ అభిమానులకు ప్రత్యేకంగా మారనుండగా, ఆయన నుంచి మరో మధురమైన ఇన్నింగ్స్‌ను ఆశిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!