

రాజ్‌కోట్ వేదికగా కేఎల్ రాహుల్ అద్భుతమైన శతకంతో మెరిశాడు. నంబర్–5లో బ్యాటింగ్‌కు దిగిన రాహుల్ 92 బంతుల్లో అజేయంగా 112 పరుగులు చేసి భారత ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. ఒత్తిడిలోనూ పూర్తి నియంత్రణతో ఆడిన రాహుల్, మిడిల్ ఆర్డర్‌పై తన ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపించాడు.
రెండో వన్డేలో భారత్ 50 ఓవర్లలో 284/7 పరుగులు చేసింది. ఓ దశలో 118 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్‌ను రాహుల్ ఒంటిచేత్తో నిలబెట్టాడు. జడేజాతో 73 పరుగులు, నితీశ్‌తో 57 పరుగుల కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి డిఫెండబుల్ స్కోర్‌కు చేర్చాడు. గిల్ అర్ధసెంచరీతో రాణించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో క్లార్క్ 3 వికెట్లు తీయగా, జేమీసన్, జాకరీ, లెనక్స్, బ్రేస్‌వెల్ తలో వికెట్ తీశారు.

వన్డేల్లో న్యూజిలాండ్‌పై కేఎల్ రాహుల్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఇప్పటివరకు 10 ఇన్నింగ్స్‌ల్లో 469 పరుగులు, 93.8 సగటు, 111.13 స్ట్రైక్‌రేట్‌తో రాణించాడు. ఈ సిరీస్‌లోనే అతడి ఖాతాలో 2 శతకాలు, 1 అర్ధశతకం ఉన్నాయి. అత్యధిక స్కోర్ 112*. న్యూజిలాండ్‌పై రాహుల్ ఆధిపత్యం మరోసారి రుజువైంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!