
న్యూస్

ఎస్ఆర్హెచ్ ఆటగాడు అభిషేక్ శర్మకు ఐపీఎల్ నిర్వాహకులు జరిమానా విధించారు. అలాగే ఆయన ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ కూడా నమోదు చేశారు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో తన క్యాచ్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన అభిషేక్ శర్మ, అభ్యంతరకర భాష ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు.
దీనికి సంబంధించి ఆయన మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించడంతో పాటు ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ఆర్టికల్ 2.3ను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!