

దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్‌పై ప్రముఖ పారిశ్రామికవేత్త, వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌లా బీహార్‌కు కూడా ఒక ఐపీఎల్ జట్టు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. బీహార్‌లో అపారమైన క్రికెట్ ప్రతిభ ఉన్నప్పటికీ, ఆ రాష్ట్రానికి ఇప్పటికీ సరైన గుర్తింపు దక్కకపోవడం బాధ కలిగిస్తోందని పేర్కొన్నారు.
తన సోషల్ మీడియా పోస్టులో అనిల్ అగర్వాల్ బీహార్‌కు చెందిన యువ క్రికెటర్ల ప్రతిభను ప్రత్యేకంగా ప్రస్తావించారు. పాట్నాకు చెందిన ఇషాన్ కిషన్, సమస్తిపూర్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ, గోపాల్‌గంజ్‌కు చెందిన సాకిబ్ హుస్సేన్ వంటి ఆటగాళ్లు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారని చెప్పారు. బీహార్ యువతకు సరైన మౌలిక సదుపాయాలు, శిక్షణ, అవకాశాలు కల్పిస్తే ప్రపంచ స్థాయి జట్టును నిర్మించగల సామర్థ్యం ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీయగా, పలువురు అభిమానులు కూడా బీహార్‌కు ఐపీఎల్ జట్టు రావాలని కోరుకుంటున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!