

ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పై భారత స్టార్ షట్లర్లు పి.వి. సింధు, లక్ష్యసేన్ దృష్టి పెట్టారు. సొంతగడ్డపై ఆడుతున్న ప్రయోజనాన్ని సానుకూలంగా మలుచుకుని ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో వారు బరిలోకి దిగుతున్నారు. గతంలో భారత్ తరఫున సైనా నెహ్వాల్ (2010), కిదాంబి శ్రీకాంత్ (2015), సింధు (2017), లక్ష్యసేన్, అలాగే సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట (2022) ఇండియా ఓపెన్ విజేతలుగా నిలిచిన సంగతి తెలిసిందే.
మంగళవారం ప్రారంభమయ్యే ఈ టోర్నమెంట్ లో మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు నుయన్ లిన్ (వియత్నాం)తో, మాళవిక బాన్సోద్ పాయ్ యు (చైనీస్ తైపీ)తో, తన్వి శర్మ వాంగ్ యి (చైనా)తో తలపడనున్నారు. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్–ఆయుష్ శెట్టి, శ్రీకాంత్–తరుణ్ మన్నెపల్లి, హెచ్.ఎస్. ప్రణయ్–లీ చుక్ (హాంకాంగ్) మధ్య పోటీలు జరగనున్నాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్–చిరాగ్ జంట, మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్–ట్రీసా జాలీ జంట తమ పోరాటాన్ని ప్రారంభించనున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!