

టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి వరుసగా రెండోసారి టీ20 వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్ తరఫున అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ అర్ధశతకాలతో రాణించి జట్టుకు భారీ స్కోర్ అందించారు.

256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. భారత్ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు తీసి కివీస్‌ను కుదిపేశారు. అక్షర్ పటేల్ 3 వికెట్లు సాధించగా, వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ చెరో వికెట్ తీశారు. ఇక న్యూజిలాండ్ తరఫున జిమ్మీ నీషమ్ 3 వికెట్లు తీసుకోగా, మ్యాట్ హెన్రీ, రచిన్ రవీంద్ర తలో వికెట్ దక్కించుకున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!