

ఈ వారం ఓటీటీలో విడుదలైన చిత్రాల మధ్య పురుషః ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ప్రారంభించి అందరి దృష్టిని ఆకర్షించింది. కొత్త హీరో పవన్ కల్యాణ్‌తో పాటు సప్తగిరి, రాజ్ కసిరెడ్డి, వెన్నెల కిశోర్, వీటీవీ గణేష్ తదితరులు నటించిన ఈ చిత్రం మే 22న థియేటర్లలో విడుదలైనా ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేదు. ఇప్పుడు ఓటీటీ ద్వారా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన నలుగురు స్నేహితుల వివాహ జీవితాలు అనుమానాలు, అపార్థాలు, గొడవల కారణంగా సంక్షోభంలో పడతాయి. భార్యలు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా, కేసు విచారణలో అసలు సమస్య ఏమిటో తెలుసుకోవాలని జడ్జి నిర్ణయిస్తాడు. ఆ తర్వాత బయటపడే నిజాలు, సరదా సంఘటనలు, భావోద్వేగ మలుపులతో కథ ముందుకు సాగుతూ కుటుంబ బంధాలు, స్నేహం, దాంపత్య జీవితం గురించి వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేస్తుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!