

ఇంగ్లాండ్ టీ20 సిరీస్లు మరియు ఆసియా క్రీడల కోసం ప్రకటించిన భారత జట్లలో పేసర్ హర్షిత్ రాణా ఎంపిక కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మోకాలి గాయం కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్న హర్షిత్ రాణా, ఇప్పటివరకు ఒక్క దేశవాళీ మ్యాచ్ కూడా ఆడకుండానే జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడంపై మాజీ భారత క్రికెటర్ సదగోప్పన్ రమేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఎంపిక బీసీసీఐ గతంలో అమలు చేసిన ఫిట్నెస్ ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
గాయాల నుంచి కోలుకున్న ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్లో తమ ఫిట్నెస్ను నిరూపించుకున్న తర్వాతే జాతీయ జట్టులోకి ఎంపికయ్యారని రమేష్ గుర్తు చేశారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు కూడా ఇదే విధానాన్ని అనుసరించారని తెలిపారు. అయితే హర్షిత్ రాణా విషయంలో మాత్రం ఆ నిబంధనలు ఎందుకు పాటించలేదని ప్రశ్నించారు. ఈ అంశంపై బీసీసీఐ సెలక్షన్ కమిటీ నుంచి వివరణ వస్తుందా అనే ఆసక్తి క్రికెట్ వర్గాల్లో నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!