
సినిమాలు

విజయ్ హజారే ట్రోఫీలో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య అద్భుత ఫామ్లో దూసుకుపోతున్నాడు. బరోడా తరఫున ఆడుతున్న పాండ్య, తొలి మ్యాచ్లోనే విదర్భపై 92 బంతుల్లో 133 పరుగులు (8 ఫోర్లు, 11 సిక్సర్లు) చేసి సెంచరీతో మెరిశాడు. ఆ తర్వాత చండీగడ్పై కేవలం 31 బంతుల్లో 75 పరుగులు సాధించి మరోసారి తన ఉగ్రరూపం చూపించాడు.
రాజ్కోట్ వేదికగా జరిగిన మ్యాచ్లో బరోడా 49.1 ఓవర్లలో 391 పరుగులు చేసి భారీ స్కోర్ నమోదు చేసింది. ప్రియాంషు మోలియా 113 పరుగులతో శతకం సాధించగా, పాండ్య 2 ఫోర్లు, 9 సిక్సర్లతో మెరుపు అర్ధశతకం బాదాడు. టోర్నీలో ఇప్పటివరకు పాండ్య 125 బంతుల్లో 208 పరుగులు (21 సిక్సర్లు, 10 ఫోర్లు) చేసి జెట్ స్పీడ్తో పరుగులు కురిపిస్తున్నాడు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!