

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత బ్యాటర్లు ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌లతో అభిమానులను అలరించారు. కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడిని ఎదుర్కొంటూ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేసి జట్టుకు విజయాలను అందించారు. భారీ స్కోర్లు నమోదు చేస్తూ భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ఇన్నింగ్స్‌లు ఎన్నో ఉన్నాయి.
2026 ఎడిషన్‌లో వెస్టిండీస్‌పై సంజూ శాంసన్ చేసిన అజేయ 97 పరుగుల ఇన్నింగ్స్ ఇప్పుడు టీ20 వరల్డ్ కప్‌లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ల జాబితాలో చోటు సంపాదించింది. సురేష్ రైనా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ ఆటగాళ్ల గొప్ప ఇన్నింగ్స్‌ల సరసన ఈ ప్రదర్శన నిలిచింది.
టీ20 వరల్డ్ కప్‌లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్లు:
101 – సురేష్ రైనా vs దక్షిణాఫ్రికా, గ్రోస్ ఐలెట్, 2010
97* – సంజూ శాంసన్ vs వెస్టిండీస్, ఈడెన్ గార్డెన్స్, 2026
92 – రోహిత్ శర్మ vs ఆస్ట్రేలియా, గ్రోస్ ఐలెట్, 2024
89* – విరాట్ కోహ్లీ vs వెస్టిండీస్, వాంఖడే, 2016
84* – సూర్యకుమార్ యాదవ్ vs USA, వాంఖడే, 2026








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!