
జనరల్

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈరోజు జరగనున్న సీఎస్కే మ్యాచ్‌కు పలువురు మాజీ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ వార్తతో సీఎస్కే అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా ఎంఎస్ ధోనీకి ఇది చివరి ఐపీఎల్ మ్యాచ్ కావొచ్చనే ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి. అభిమానులు ఇప్పటికే చెపాక్‌కు భారీగా చేరుకుంటూ ప్రత్యేక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.
ధోనీ రిటైర్మెంట్పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, సోషల్ మీడియాలో దీనిపై చర్చలు ఉధృతంగా సాగుతున్నాయి. మాజీ సీఎస్కే ఆటగాళ్ల హాజరు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా నిలిచిన ధోనీకి అభిమానులు భావోద్వేగ వీడ్కోలు పలికే అవకాశముందనే చర్చ జరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!