
రాజకీయాలు

ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ చరిత్రలో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. గత 68 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం 33 మ్యాచ్‌ల్లోనే 100 గోల్స్ మైలురాయిని అందుకుంది. స్వీడన్‌తో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ స్టార్ ఆటగాడు కోడి గ్యాక్‌పో సాధించిన గోల్‌తో ఈ ఘనత నమోదైంది. దీంతో ఈ ఎడిషన్ అత్యంత వేగంగా 100 గోల్స్ నమోదు చేసిన ప్రపంచకప్‌గా నిలిచింది.
మరోవైపు, నెదర్లాండ్స్ జట్టు కూడా ప్రత్యేక మైలురాయిని అందుకుంది. ప్రపంచకప్ చరిత్రలో 100 గోల్స్ పూర్తి చేసిన ఎనిమిదో దేశంగా డచ్ జట్టు రికార్డు సృష్టించింది. 1982, 2014 ప్రపంచకప్‌లలో 100 గోల్స్ చేరుకోవడానికి 36 మ్యాచ్‌లు పట్టగా, 1978, 1994 టోర్నీలలో 38 మ్యాచ్‌లు అవసరమయ్యాయి. లీగ్ దశ నుంచే ఫార్వర్డ్ ఆటగాళ్లు చెలరేగిపోతుండటంతో ఈసారి ప్రపంచకప్ గోల్స్ వర్షంతో అభిమానులను అలరిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!