
గాసిప్స్

ప్రతిష్టాత్మక బాక్సింగ్ డే టెస్టులో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి యాషెస్ సిరీస్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. 175 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 32.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయవంతంగా ఛేదించింది.
ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 152 పరుగులకే ఆలౌట్ కాగా, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 110 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఇంగ్లాండ్ బౌలర్లకు లొంగిపోయి 132 పరుగులకే పరిమితమయ్యారు.
దీంతో నాలుగో టెస్టులో పోరాటాత్మక ప్రదర్శన కనబరిచిన ఇంగ్లాండ్ గెలుపొందింది. ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఇప్పటికే వరుసగా మూడు టెస్టులు గెలవగా, ఈ మ్యాచ్‌తో ఇంగ్లాండ్ ఖాతాలో తొలి విజయం చేరింది.







.jpg&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!