

చెస్ ఒలింపియాడ్ ఎనిమిదో రౌండ్‌లో భారత మహిళల, పురుషుల జట్లకు డ్రాలు ఎదురయ్యాయి. కజకిస్థాన్‌తో జరిగిన మహిళల విభాగం మ్యాచ్‌ను భారత్ 2-2తో డ్రా చేసుకుంది. సవిత శ్రీ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తూ టోర్నీలో ఏడో విజయాన్ని నమోదు చేసింది. తొలుత వైశాలి ఓటమి పాలవడంతో భారత్ వెనుకబడగా.. సవిత విజయం సాధించి స్కోరును సమం చేసింది. అనంతరం దివ్య దేశ్‌ముఖ్, కోనేరు హంపి తమ గేమ్‌లను డ్రా చేసుకోవడంతో మ్యాచ్ 2-2తో ముగిసింది. మహిళల విభాగంలో చైనా, కజకిస్థాన్ 13 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉండగా.. భారత్ అర పాయింట్ వెనుకబడి ఉంది.
ఓపెన్ విభాగంలోనూ భారత్ అజర్‌బైజాన్‌తో 2-2తో డ్రా చేసుకుంది. డి. గుకేశ్, ఆర్. ప్రజ్ఞానంద, అర్జున్ ఎరిగైసి, నిహాల్ సరీన్ తమ ప్రత్యర్థులతో గేమ్‌లను డ్రా చేసుకుని పాయింట్లు పంచుకున్నారు. ఓపెన్ విభాగంలో జర్మనీ, ఉజ్బెకిస్థాన్ 14 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. భారత్, నెదర్లాండ్స్ 13 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మిగిలిన రౌండ్లలో భారత జట్లు మరింత మెరుగైన ప్రదర్శనపై దృష్టి పెట్టనున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!