
జనరల్

కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభ వేడుకల్లో భారత పతాకధారులుగా వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ వ్యవహరించనున్నట్లు భారత ఒలింపిక్ సంఘం ప్రకటించింది. ఒలింపిక్ పతక విజేతలైన ఈ ఇద్దరు క్రీడాకారిణులు గ్లాస్గో వేదికగా జరిగే ప్రారంభోత్సవంలో భారత బృందాన్ని ముందుండి నడిపించనున్నారు.
ఈ నెల 23న కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. భారత బృందానికి పతాకధారులుగా ఎంపికైన చాను, లవ్లీనాకు ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష అభినందనలు తెలిపారు. పోటీల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులందరికీ ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!