

భారత క్రికెట్ నియంత్రణ మండలి టీమిండియా టీ20 కెప్టెన్సీలో కీలక మార్పులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్‌ను తప్పించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అతని స్థానంలో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను కొత్త టీ20 కెప్టెన్‌గా ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఐపీఎల్ ముగిసిన తర్వాత ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల కోసం భారత జట్టును ఎంపిక చేసే సమయంలో ఈ మార్పుపై అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ ఈ వార్త భారత క్రికెట్ వర్గాల్లో, అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీసింది. భవిష్యత్తు టీ20 ప్రణాళికల్లో భాగంగా స్థిరమైన నాయకత్వాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకునే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!