

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో 50వ రోజు నామినేషన్ల ప్రక్రియ హౌస్‌లో మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. గ్రీన్ లెవల్లో ఉన్న త్రిగుణ్, దేబ్జానీ, ముకేశ్, అమన్, నీతూలకు నామినేషన్లు చేసే అవకాశం కల్పించారు. అమన్, దేబ్జానీ, నీతూ, ముకేశ్ ఒక్కొక్కరిని నామినేట్ చేయాలని నిర్ణయించుకోగా, త్రిగుణ్ మాత్రం ముగ్గురిని నామినేట్ చేసే అవకాశాన్ని ఎంచుకున్నాడు. టాస్కుల్లో బాగా ఆడుతున్నప్పటికీ హౌస్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంలో వెనుకబడిందని పేర్కొంటూ నీతూ ఝాన్సీని నామినేట్ చేసింది. మరోవైపు, ఆర్కే ప్రవర్తనలో స్పష్టత లేదని విమర్శిస్తూ ముకేశ్ అతడిని నామినేషన్లోకి తీసుకొచ్చాడు.
రోహిత్‌ను నామినేట్ చేసిన త్రిగుణ్.. అతడి ఆటతీరు, ప్రవర్తనపై విమర్శలు చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. అగ్ని పరీక్ష సమయంలో కనిపించిన ఉత్సాహం ఇప్పుడు రోహిత్లో కనిపించడం లేదని త్రిగుణ్ వ్యాఖ్యానించాడు. దీనికి స్పందించిన రోహిత్, షాలినీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. తనకు మూడు చపాతీలు వచ్చినప్పుడు రెండు మాత్రమే తిని, మిగిలిన ఒకదాన్ని షాలినీ తనకు ఇచ్చేదని చెబుతూ, ఆమె తన అవసరాలను ఎంతో శ్రద్ధగా చూసుకునేదని వివరించాడు. ఆమె వీడ్కోలు సమయంలో ఇచ్చిన ముద్దును కొందరు మరోలా అర్థం చేసుకున్నారని, అయితే తాను ఒంటరిగా మిగిలిపోతానేమోననే భయంతో అలా భావోద్వేగానికి గురయ్యానని చెప్పాడు. తన వ్యక్తిగత అనుబంధాల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని త్రిగుణ్‌కు సూచిస్తూ, తనకు ఇచ్చిన బ్యాడ్జి కారణంగానే సంయమనంతో ఉన్నానని రోహిత్ వ్యాఖ్యానించాడు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!