
జనరల్

జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో విశాఖపట్నం నగరంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ నాయకులు వినూత్న పద్ధతుల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ పాత అంబాసిడర్ కారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సంప్రదాయ రూపంలో ఉన్న ఈ కారును చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపిస్తున్నారు.
కూటమి మేయర్ అభ్యర్థిగా బరిలో ఉన్న ముక్కా శ్రావణి కుటుంబ సభ్యులు, 49వ వార్డు నుంచి తెలుగుదేశం పార్టీ (తెదేపా) అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆమె అక్క పొట్నూరు నీలవేణికి మద్దతుగా ప్రచారం చేసేందుకు ఈ కారును సిద్ధం చేశారు. కారుకు పూర్తిగా పసుపు రంగు వేయడంతో ప్రచారంలో అది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!