27, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జగపతిబాబు టాక్ షోలో నారా లోకేశ్ సందడి

Writer: Harika S 08:16 AM, 27 అక్టోబర్, 2026
జగపతిబాబు టాక్ షోలో నారా లోకేశ్ సందడి

నిత్యం బిజీగా ఉండే ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, ప్రముఖ నటుడు జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సెలబ్రిటీ టాక్‌ షోలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. జీ5 ఓటీటీలో ప్రసారమవుతున్న ఈ షో సీజన్ 2లో లోకేశ్ పాల్గొన్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తూ, ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ షోలో నారా లోకేశ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు సరదా విషయాలను పంచుకున్నారు. తన స్కూల్ రోజులను గుర్తుచేసుకుంటూ, తరగతిలో అందరికంటే ఎక్కువ పనిష్మెంట్లు తనకే పడేవని నవ్వుతూ చెప్పారు. "నిజంగానే అంత అల్లరి చేసేవారా?" అని జగపతిబాబు ప్రశ్నించగా.. "మామయ్యతో పోటీ పడాల్సి వచ్చేది" అంటూ లోకేశ్ చమత్కరించారు.

తన పెళ్లికి ముందు జరిగిన ఓ సరదా సంఘటనను కూడా ఆయన ప్రస్తావించారు. తనను ‘అల్లుడుగారు’ అని పిలవగానే, ఏదో ఫిట్టింగ్ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారని అనుమానం వచ్చిందని సరదాగా గుర్తుచేసుకున్నారు.ఇదే క్రమంలో, మామ నందమూరి బాలకృష్ణ గురించి మాట్లాడుతూ.. ఆయన జీవితంలో ఒకే ఒక్క వ్యక్తికి భయపడతారని చెప్పి సస్పెన్స్ క్రియేట్ చేశారు. ప్రోమో చివర్లో లోకేశ్, బాలయ్య ఐకానిక్ చిత్రాల్లో ఒకటైన 'లెజెండ్' సినిమాలోని "ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు!" అనే పవర్‌ఫుల్ డైలాగ్‌ను చెప్పి అందరినీ ఆకట్టుకున్నారు.కాగా, ఈ పూర్తి ఎపిసోడ్ నవంబర్ 6న జీ5లో ప్రీమియర్ కానుండగా, నవంబర్ 8న సాయంత్రం 7:30 గంటలకు జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారం కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్‌ 10 తెలుగు డే 50: త్రిగుణ్ కామెంట్స్‌తో రోహిత్ ఫైర్..షాలినితో బంధంపై కీలక వ్యాఖ్యలు

బిగ్‌బాస్‌ 10 తెలుగు డే 50: త్రిగుణ్ కామెంట్స్‌తో రోహిత్ ఫైర్..షాలినితో బంధంపై కీలక వ్యాఖ్యలు

బిగ్‌బాస్ తెలుగు డే 50 ప్రోమో 2 విడుదల

బిగ్‌బాస్ తెలుగు డే 50 ప్రోమో 2 విడుదల

బిగ్‌బాస్ 10: నరేష్‌కు నాగార్జున బంపర్ ఆఫర్..

బిగ్‌బాస్ 10: నరేష్‌కు నాగార్జున బంపర్ ఆఫర్..

బిగ్‌బాస్‌ 10లో త్రిగుణ్‌పై నాగార్జున ఫైర్‌..

బిగ్‌బాస్‌ 10లో త్రిగుణ్‌పై నాగార్జున ఫైర్‌..

బిగ్‌బాస్‌ బజ్‌లో షాలినీ కన్నీళ్లు...

బిగ్‌బాస్‌ బజ్‌లో షాలినీ కన్నీళ్లు...

బిగ్‌బాస్‌ 10లో ఎనిమిదో వారం నామినేషన్ల రచ్చ..

బిగ్‌బాస్‌ 10లో ఎనిమిదో వారం నామినేషన్ల రచ్చ..

ట్యాగ్లు
నారా లోకేష్జగపతి బాబుజీ షోఏపీ మంత్రిఏపీనందమూరి బాలకృష్ణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అండర్‌-19 ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఆదిత్య...
క్రీడలు

అండర్‌-19 ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఆదిత్య...

మారుతి పరిస్థితి ఏంటి?
గాసిప్స్

మారుతి పరిస్థితి ఏంటి?

దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపులు.. చెన్నైలో నిందితుడి అరెస్ట్
జనరల్

దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపులు.. చెన్నైలో నిందితుడి అరెస్ట్

వృషకర్మకు దిల్ రాజు అండ?
సినిమాలు

వృషకర్మకు దిల్ రాజు అండ?

ఏలూరు మేయర్‌ పీఠంపై కూటమి, వైఎస్సార్‌సీపీ మధ్య పోటీ..
జనరల్

ఏలూరు మేయర్‌ పీఠంపై కూటమి, వైఎస్సార్‌సీపీ మధ్య పోటీ..

పార్టీలకు బాలీవుడ్ భారీ ఏర్పాట్లు?
గాసిప్స్

పార్టీలకు బాలీవుడ్ భారీ ఏర్పాట్లు?

అన్నాడీఎంకేలోకి ధనుష్‌ ఎంట్రీ?
రాజకీయాలు

అన్నాడీఎంకేలోకి ధనుష్‌ ఎంట్రీ?

గోవిందా సంచలన ఆరోపణలు?
గాసిప్స్

గోవిందా సంచలన ఆరోపణలు?

2.0 రికార్డు బద్దలు.. జైలర్ 2 సంచలనం!
సినిమాలు

2.0 రికార్డు బద్దలు.. జైలర్ 2 సంచలనం!

గాడ్ ఆఫ్ వార్‌లో తారక్‌కు జోడిగా అలియా?
గాసిప్స్

గాడ్ ఆఫ్ వార్‌లో తారక్‌కు జోడిగా అలియా?

అర్నబ్ తుపాను అతి తీవ్రంగా మార్పు.. ఏపీలో పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్
జనరల్

అర్నబ్ తుపాను అతి తీవ్రంగా మార్పు.. ఏపీలో పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్

శాంతి బాండ్లపై సీజేపీ నేతలకు మార్కండేయ కట్జూ చురకలు
జనరల్

శాంతి బాండ్లపై సీజేపీ నేతలకు మార్కండేయ కట్జూ చురకలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!