

బిగ్‌బాస్ తెలుగు డే 19 ఎపిసోడ్ 20లో కెప్టెన్సీ పోటీ కీలక దశకు చేరుకోవడంతో హౌస్‌లో ఉత్కంఠ పెరిగింది. అగ్నిపరీక్ష ట్విస్ట్‌లో భాగంగా అపూర్వ, మిథిలేష్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. హౌస్‌మేట్స్ ఓటింగ్ ద్వారా అపూర్వకు ప్రవేశం లభించగా, మిథిలేష్, రామకృష్ణలకు సమాన ఓట్లు రావడంతో ఇద్దరికీ ప్రత్యేక టాస్క్ నిర్వహించారు. అందులో మిథిలేష్ విజయం సాధించి బిగ్‌బాస్ ఇంట్లో తన స్థానాన్ని ఖరారు చేసుకున్నాడు.
అపూర్వ ఎంట్రీతో ఇంట్లో అప్పటికే ఉన్న పాత పరిచయాలు, విభేదాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. రోహిత్, షాలినీ మధ్య అపూర్వ గురించి చర్చ జరగగా, మరోవైపు త్రిగుణ్, అమన్ మధ్య ఇంటి పనుల విషయంలో గొడవ జరిగింది. ఈ వివాదం క్రమంగా పెద్దదవడంతో ఇతర కంటెస్టెంట్లు కూడా మధ్యలోకి వచ్చారు. అనంతరం అమన్ త్రిగుణ్‌కు క్షమాపణ చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. గుడ్ల విషయంలో రోహిత్, అపూర్వ మధ్య కూడా వాగ్వాదం చోటుచేసుకుంది.
కెప్టెన్సీ పోటీలో మరో కీలక ట్విస్ట్‌గా అపూర్వ, మిథిలేష్‌లకు బిగ్‌బాస్ ప్రత్యేక పవర్ ఇచ్చాడు. కెప్టెన్సీ కంటెండర్లలో తమ దృష్టిలో అనర్హులుగా భావించిన ఇద్దరి పేర్లు చెప్పాలని, అందుకు కారణాలు వివరించాలని సూచించాడు. అపూర్వ శ్రిష్టి పేరును ఎంపిక చేయగా, మిథిలేష్ అమన్ పేరును సూచించాడు. ఈ నిర్ణయాలపై హౌస్‌లో మరోసారి చర్చలు, వాదనలు జరిగాయి.
చివరగా కెప్టెన్సీ టాస్క్‌లో అపూర్వ, ముఖేష్ ఒక టీంగా.. ఝాన్సీ, మిథిలేష్ మరో టీంగా పోటీ పడ్డారు. ఈ పోటీలో ముఖేష్, అపూర్వ జోడీ విజయం సాధించింది. అనంతరం బిగ్‌బాస్ ముఖేష్‌ను ఇంటి కెప్టెన్‌గా ప్రకటించడంతో పాటు అపూర్వకు ఇమ్యూనిటీని అందించాడు. దీంతో ఒకే టాస్క్ ద్వారా ముఖేష్‌కు కెప్టెన్సీ, అపూర్వకు ఇమ్యూనిటీ లభించడం డే 19 ఎపిసోడ్ 20లో ప్రధాన హైలైట్‌గా నిలిచింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!