

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఐదో వారం ముగింపు దశకు చేరుకోవడంతో వీకెండ్ ఎపిసోడ్‌పై ఆసక్తి పెరిగింది. నాగార్జున హోస్ట్‌గా రానున్న తాజా ఎపిసోడ్‌లో ఎలిమినేషన్‌తో పాటు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల ఎంట్రీలు ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో కొత్తగా హౌస్‌లోకి రానున్న కంటెస్టెంట్ల ముఖాలను మాస్కులతో చూపించారు. వారు ఎవరో గుర్తించాలంటూ నాగార్జున హౌస్‌మేట్స్‌కు చిన్న పరీక్ష పెట్టగా, చాలామంది సరైన సమాధానం చెప్పలేకపోయారు.
మరోవైపు, హౌస్‌లోని కంటెస్టెంట్లపై తమ అభిప్రాయాలు చెప్పాలని నాగార్జున వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు సూచించారు. ఈ క్రమంలో పలువురు షాలినిని టార్గెట్ చేస్తూ, ఆమె సొంతంగా గేమ్ ఆడటం లేదని, రోహిత్‌ను ఆధారంగా చేసుకుని ముందుకు సాగుతోందని వ్యాఖ్యానించారు. దీనిపై షాలిని కూడా ఘాటుగా స్పందిస్తూ, హౌస్‌లోకి వచ్చాక చూద్దామంటూ సవాల్ విసిరింది. ఇదిలా ఉండగా, శివ కుమార్, సాక్షి నాయుడు, డాక్షి గుత్తికొండ, నీతూ నటరాజ్, రామకృష్ణ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే, వారి ప్రవేశంపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!