

బిగ్ బాస్ తెలుగు 10 రెండో వారం ఎలిమినేషన్‌లో కృష్ణుడు హౌస్ నుంచి బయటకు వచ్చాడు. చివరి రౌండ్‌లో సృష్టి, కృష్ణుడు మాత్రమే ఉండగా.. కృష్ణుడు ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. బయటకు వస్తున్న సమయంలో కృష్ణుడు భావోద్వేగానికి గురయ్యాడు. హౌస్‌లో తాను అనుకున్న స్థాయిలో గేమ్ ఆడలేకపోయానని అంగీకరించిన ఆయన.. అందుకు బాధపడటం లేదని చెప్పారు. తొలి వారంలో తనతో గొడవపడిన రోహిత్‌కు కృష్ణుడు క్షమాపణలు చెప్పగా, రోహిత్ కూడా భావోద్వేగానికి గురయ్యాడు. త్రిగుణ్ సైతం కృష్ణుడిని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు.
స్టేజ్‌పై తన బిగ్ బాస్ అనుభవాన్ని పంచుకున్న కృష్ణుడు.. భిన్నమైన వ్యక్తిత్వాలు కలిగిన వారితో కలిసి ఉండటం ద్వారా జీవితంపై ఎన్నో విషయాలు అర్థమయ్యాయని చెప్పారు. అనంతరం హౌస్‌లోని పాజిటివ్, నెగిటివ్ కంటెస్టెంట్ల గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు. తన ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడుతూ, రోజూ స్వీట్లు తినే అలవాటు ఉన్న తనకు గత ఎనిమిది రోజులుగా షుగర్, స్వీట్లు పూర్తిగా మానేయడంతో శరీరం నీరసించిందని చెప్పారు. దాని ప్రభావం తన గేమ్‌పై పడిందని వివరించారు. దీనిపై నాగార్జున స్పందిస్తూ.. బయటకు వెళ్లిన తర్వాత పంచదార వినియోగాన్ని ఒక్కసారిగా కాకుండా క్రమంగా తగ్గించాలని సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!