29, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో రహదారులకు భారీ నష్టం.. రంగంలోకి 24 ప్రత్యేక బృందాలు!

Writer: Harika S 02:06 PM, 29 అక్టోబర్, 2026
ఏపీలో రహదారులకు భారీ నష్టం.. రంగంలోకి 24 ప్రత్యేక బృందాలు!

అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రహదారులు, రవాణా వ్యవస్థకు గణనీయమైన నష్టం వాటిల్లింది. అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 126 కిలోమీటర్ల ఆర్‌అండ్‌బీ రహదారులు దెబ్బతిన్నాయి. బలమైన గాలులకు 1,058 చెట్లు నేలకూలగా, వాటిలో 859 చెట్లను తొలగించారు. రెండు చోట్ల రహదారులు కోతకు గురయ్యాయి. నీరు నిలిచిపోవడం, ఇతర సమస్యల కారణంగా 57 ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, 20 చోట్ల సమస్యలను పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు. తాత్కాలిక మరమ్మతులకు రూ.9.17 కోట్లు, శాశ్వత పునరుద్ధరణ పనులకు రూ.50.27 కోట్లు అవసరమవుతాయని ఇంజినీర్లు అంచనా వేశారు. మొత్తంగా రూ.59.44 కోట్ల వ్యయం అవుతుందని పేర్కొన్నారు. వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేపట్టి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

జాతీయ రహదారులపైనా తుఫాన్ ప్రభావం కనిపించింది. వివిధ మార్గాల్లో 149 చెట్లు నేలకూలగా, రావులపాలెం సమీపంలోని సిద్ధాంతం నుంచి అనకాపల్లి వరకు 75 చెట్లు, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో మరో 74 చెట్లు పడిపోయాయి. అధికారులు చెట్లను తొలగించి, కూలిన విద్యుత్ స్తంభాన్ని సైతం తొలగించారు. జాతీయ రహదారులపై సుమారు 1,350 గుంతలను గుర్తించి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ఏలూరు నుంచి శ్రీకాకుళం వరకు జాతీయ రహదారులపై సహాయక చర్యల కోసం 32 రూట్ పెట్రోలింగ్ వాహనాలు, 31 అంబులెన్స్‌లు, 35 క్రేన్లు, 47 జేసీబీలు, 25 చెట్లు నరికే రంపాలు, 45 డంపర్లను అందుబాటులో ఉంచారు. అదనంగా 24 ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు. నీరు నిలిచిన సర్వీస్ రోడ్లు, అండర్‌పాస్‌ల వద్ద పంపులతో నీటిని తొలగిస్తున్నారు. తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో ముందస్తు జాగ్రత్తగా బస్సు సర్వీసులను నిలిపివేయగా, మరికొన్ని ప్రాంతాల్లో పరిమితంగా నడిపారు. రహదారుల మరమ్మతులు, చెట్ల తొలగింపు, నీటి తొలగింపు పనులను వేగవంతం చేసి రవాణా వ్యవస్థను సాధారణ స్థితికి తీసుకురావడంపై అధికారులు దృష్టి సారించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పుల్లారెడ్డి స్వీట్స్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా

పుల్లారెడ్డి స్వీట్స్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా

స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లకు దూరంగా ఇషా అంబానీ పిల్లలు.. ఈ ఎంపిక వెనుక ప్రత్యేకత ఇదే!

స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లకు దూరంగా ఇషా అంబానీ పిల్లలు.. ఈ ఎంపిక వెనుక ప్రత్యేకత ఇదే!

వైద్యుల సలహా లేకుండా మందుల మోతాదు తగ్గిస్తే ప్రమాదం.. చాట్‌జీపీటీ ఘటనతో హెచ్చరిక

వైద్యుల సలహా లేకుండా మందుల మోతాదు తగ్గిస్తే ప్రమాదం.. చాట్‌జీపీటీ ఘటనతో హెచ్చరిక

రెబల్ అభ్యర్థులకు చంద్రబాబు అల్టిమేటం

రెబల్ అభ్యర్థులకు చంద్రబాబు అల్టిమేటం

బెంగళూరు నుంచి మధ్యప్రదేశ్ వరకు ఈడీ సోదాలు

బెంగళూరు నుంచి మధ్యప్రదేశ్ వరకు ఈడీ సోదాలు

అర్నబ్ తుపాను దెబ్బకు ఏపీకి భారీ నష్టం

అర్నబ్ తుపాను దెబ్బకు ఏపీకి భారీ నష్టం

ట్యాగ్లు
అర్నబ్ తుఫాన్ఆంధ్రప్రదేశ్రహదారుల నష్టంరహదారుల మరమ్మతులుజాతీయ రహదారులుబీసీ జనార్దన్ రెడ్డిఎన్‌హెచ్‌ఏఐరవాణా అంతరాయం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..
జనరల్

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..

మెగాస్టార్ చిరంజీవి టాక్ షోకు టైటిల్ ఫిక్స్
ఓటీటీ

మెగాస్టార్ చిరంజీవి టాక్ షోకు టైటిల్ ఫిక్స్

భారత్‌లోనే కాదు, పాకిస్థాన్‌లోనూ ‘రామాయణ’ సందడి
సినిమాలు

భారత్‌లోనే కాదు, పాకిస్థాన్‌లోనూ ‘రామాయణ’ సందడి

బ్రెజిల్ రాజకీయాల్లో కలకలం.. అమెరికాలో ప్రత్యక్షమైన ఫ్లేవియో బొల్సనారో
జనరల్

బ్రెజిల్ రాజకీయాల్లో కలకలం.. అమెరికాలో ప్రత్యక్షమైన ఫ్లేవియో బొల్సనారో

టపాసుల నిషేధంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

టపాసుల నిషేధంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

రణబాలి తర్వాత విజయ్ ప్లాన్ ఇదేనా?
గాసిప్స్

రణబాలి తర్వాత విజయ్ ప్లాన్ ఇదేనా?

ఏపీలో కరవు లేదు.. తెలంగాణలో రేవంత్‌ వల్లే కరవు: కేటీఆర్‌
రాజకీయాలు

ఏపీలో కరవు లేదు.. తెలంగాణలో రేవంత్‌ వల్లే కరవు: కేటీఆర్‌

పుల్లారెడ్డి స్వీట్స్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా
జనరల్

పుల్లారెడ్డి స్వీట్స్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా

‘యానిమల్’ ఓపెనింగ్ రికార్డును ‘రామాయణ’ అధిగమిస్తుందా?
గాసిప్స్

‘యానిమల్’ ఓపెనింగ్ రికార్డును ‘రామాయణ’ అధిగమిస్తుందా?

స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లకు దూరంగా ఇషా అంబానీ పిల్లలు.. ఈ ఎంపిక వెనుక ప్రత్యేకత ఇదే!
జనరల్

స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లకు దూరంగా ఇషా అంబానీ పిల్లలు.. ఈ ఎంపిక వెనుక ప్రత్యేకత ఇదే!

వైద్యుల సలహా లేకుండా మందుల మోతాదు తగ్గిస్తే ప్రమాదం.. చాట్‌జీపీటీ ఘటనతో హెచ్చరిక
జనరల్

వైద్యుల సలహా లేకుండా మందుల మోతాదు తగ్గిస్తే ప్రమాదం.. చాట్‌జీపీటీ ఘటనతో హెచ్చరిక

భర్త కోసం కర్వా చౌత్ ఉపవాసం ఉండను.. కరీనా కపూర్ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

భర్త కోసం కర్వా చౌత్ ఉపవాసం ఉండను.. కరీనా కపూర్ సంచలన వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!