
రాజకీయాలు

బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్స్ ప్రక్రియ మరోసారి వేడెక్కింది. గత ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్‌ను రెండు గ్రూపులుగా విడగొట్టి టాస్కులు నిర్వహించగా.. షాలిని–అపూర్వ, రోహిత్–త్రిగున్ మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఈ వారం నామినేషన్స్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది.
తాజా ప్రోమోలో అమన్, రోహిత్.. త్రిగున్‌ను నామినేట్ చేయడంతో అతడితో వాగ్వాదానికి దిగినట్లు కనిపిస్తోంది. షాలినితో రోహిత్‌కు జరిగిన గొడవలో త్రిగున్ ఆమెకు మద్దతుగా నిలవడంతో.. ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ రోహిత్ త్రిగున్‌ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు నరేశ్.. అమన్‌ను నామినేట్ చేశాడు. దీంతో నేటి ఎపిసోడ్‌లో నామినేషన్స్ ప్రక్రియ మరింత ఆసక్తికరంగా సాగనున్నట్లు ప్రోమో ద్వారా తెలుస్తోంది.







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!