
జనరల్

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మే 27న ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ప్రాంతీయ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.
రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం, ఎస్‌ఐఆర్ అంశం, పార్టీ కమిటీల పునర్వ్యవస్థీకరణపై సమావేశంలో చర్చ జరగనుంది. అలాగే ప్రభుత్వ పనితీరు, ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై కూడా సమీక్ష చేయనున్నారు. పార్టీని బలోపేతం చేయడం, ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే వ్యూహాలపై వైఎస్ జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!