

ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను వైఎస్సార్‌సీపీ శ్రేణులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలు అందరికీ తెలుసని, ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఉపఎన్నికల్లో కూడా ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేశారో చూశామని ఆయన ఆరోపించారు. పోలీసులు అడ్డం పెట్టుకుని అధికార కూటమి వ్యవహరిస్తోందని విమర్శించిన జగన్, ఎక్కడా ఏకగ్రీవాలు జరగకూడదని పార్టీ ఇన్‌చార్జ్‌లకు సూచించారు.
అలాగే ఓట్ల తొలగింపుల అంశాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓట్లు తొలగించారని, దీనివల్ల ఎన్నికల ఫలితాలపై ప్రభావం పడిందని అన్నారు. ఏపీలో కూడా ఓటర్ల జాబితాలపై జాగ్రత్తగా నిఘా ఉంచాలని పార్టీ నేతలకు సూచించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను ప్రజలకు గుర్తు చేయాలని, ప్రస్తుతం అవి ఎలా రద్దయ్యాయో వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!