
జనరల్

నగరంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం భూమి కంపించడం స్థానికుల్లో ఆందోళన కలిగించింది. ఉదయం 5.08 గంటలకు సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేల్‌పై 4.5 తీవ్రతతో నమోదైనట్లు సమాచారం. తీవ్రత ఎక్కువగా లేకపోయినా, కొద్ది సేపు కంపనలు అనుభవించడంతో ప్రజలు ఇళ్ల బయటకు వచ్చారు.
గాజువాక, మంగళపాలెం, పెదవాల్తేరు, ఆరిలోవ, ఎంవీపీ అప్పుఘర్ ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా భారీ ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం లేదు. పరిస్థితిని అధికారులు సమీక్షిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!