
జనరల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ట్రూత్’ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్‌పై దాడి చేసేందుకు వెయ్యి క్షిపణులు సిద్ధంగా ఉన్నాయని, మరికొన్ని వేల క్షిపణులు వెంటనే ప్రయోగించగలమని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు అంతరాయం కలిగించబోమని ఇరాన్ ప్రకటించాలని అమెరికా అధికారులు కోరిన విషయం గమనార్హం.
దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కుమారుడు మొజ్తాబా ఖమేనీ కఠిన హెచ్చరికలు చేశారు. తన తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని, యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం జరిగేవరకు వెనక్కి తగ్గబోమని తెలిపారు. ఈ ప్రకటనలను ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ప్రసారం చేయడంతో ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!