

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు అని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సంప్రదాయ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంతో పాటు ఆధునిక సాంకేతికతపై పెట్టుబడులు పెడుతోందని చెప్పారు. సంప్రదాయ మరియు ఆధునిక సామర్థ్యాల సమన్వయానికి ఆపరేషన్ సిందూర్ ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. సాంకేతికంగా అభివృద్ధి చెందిన, యుద్ధానికి సిద్ధంగా ఉన్న నౌకాదళాన్ని నిర్మించాలన్న దేశ నిబద్ధతకు ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.
విశాఖపట్నంలో తూర్పు నౌకాదళ కమాండ్ ఎన్-14ఏ జెట్టీలో అధునాతన స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్‌ఎస్ మహేంద్రగిరిని జాతికి అంకితం చేశారు. ఈ యుద్ధనౌక ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రతీకగా నిలుస్తుందని, 75 శాతానికి పైగా స్వదేశీ సాంకేతికతతో నిర్మించామని తెలిపారు. ఒడిశాలోని మహేంద్రగిరి పర్వతశ్రేణి పేరుతో నామకరణం చేసిన ఈ నౌకలో బ్రహ్మోస్ క్షిపణి అమర్చే సామర్థ్యం ఉంది. యుద్ధ కార్యకలాపాలతో పాటు సముద్ర భద్రత కార్యక్రమాల్లో కూడా ఇది కీలక పాత్ర పోషించనుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!