
జనరల్

జిన్‌పింగ్ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ ఆక్రమణపై భవిష్యత్తులో పశ్చాత్తాపపడే అవకాశం ఉందని జిన్‌పింగ్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీంతో రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై చైనా వైఖరిలో మార్పు వస్తోందా అనే చర్చ ప్రారంభమైంది.
అయితే ఈ అంశంపై అమెరికా, చైనా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. మరోవైపు పుతిన్ రెండు రోజుల అధికారిక పర్యటన కోసం బీజింగ్ చేరుకున్నారు. ట్రంప్ చైనా పర్యటన ముగిసిన కొద్ది రోజులకే పుతిన్ బీజింగ్ వెళ్లడం అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాలు, ప్రపంచ రాజకీయ పరిణామాలపై చర్చలు జరగనున్నట్లు సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!