

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇంకా తగ్గే సూచనలు కనిపించడం లేదు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వం యుద్ధాన్ని మరింత తీవ్రం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వేలాది మంది అమెరికా సైనికులను అక్కడికి పంపే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి మార్గంలో చమురు రవాణాకు భద్రత కల్పించేందుకు నావిక, వైమానిక దళాలను బలపర్చే దిశగా చర్చలు జరుగుతున్నాయి.
ఇక ఇరాన్‌కు ముఖ్యమైన ఖర్గ్ దీవి సమీపంలో కూడా సైన్యాన్ని మోహరించే అంశాన్ని అమెరికా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఇది చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోలేదు. ఇదిలా ఉండగా యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ తెలిపిన ప్రకారం, గత నెల నుంచి ఇరాన్‌పై 7,800కు పైగా దాడులు జరిగాయి. దాదాపు 120 నౌకలు ధ్వంసమయ్యాయి. ఈ యుద్ధంలో 13 మంది అమెరికా సైనికులు మృతి చెందగా, సుమారు 200 మంది గాయపడ్డారు.













.jpg&w=3840&q=75)






.jpg&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!