
జనరల్

కేరళ, తమిళనాడు, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే విజయం సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా విజయం సాధిస్తామని ఆయన అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్–ప్రయాగ్‌రాజ్‌లను కలుపుతూ నిర్మించిన 594 కిలోమీటర్ల గంగా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. పశ్చిమ బెంగాల్‌లో ఈసారి ఓటర్లు భయరహిత వాతావరణంలో ఓటు హక్కు వినియోగిస్తున్నారని పేర్కొన్నారు.
అంతకుముందు వారణాసిలో ప్రధాని రోడ్‌షో నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాల మీదుగా సాగిన ఈ రోడ్‌షో కాశీ విశ్వనాథ ఆలయం వద్ద ముగిసింది. అక్కడ వేద మంత్రాల నడుమ ఆయన ప్రార్థనలు చేశారు.
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!