
జనరల్

పశ్చిమ బెంగాల్లో జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఆరు కీలక నిర్ణయాలు తీసుకుంది. సరిహద్దు భద్రతను బలోపేతం చేయడానికి 45 రోజుల్లోగా బీఎస్ఎఫ్కు భూమి కేటాయించి సరిహద్దు కంచె నిర్మాణానికి సహకరించాలని నిర్ణయించింది.
అలాగే రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేంద్ర పథకాలను అమలు చేయడంతో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS)ను తక్షణమే అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. కేంద్ర శిక్షణ కార్యక్రమాలకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ల ఉద్యోగ పొడిగింపును ప్రకటించడంతో పాటు హత్యకు గురైన బీజేపీ కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలవాలని నిర్ణయించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!