

వ్లాదిమిర్ పుతిన్ త్వరలో మరోసారి భారత్‌కు రానున్నారు. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఈ ఏడాది బ్రిక్స్ సదస్సుకు భారత్ అధ్యక్ష దేశంగా వ్యవహరిస్తోంది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఇండియా-రష్యా వార్షిక సదస్సుకు హాజరైన పుతిన్, ఆరు నెలల వ్యవధిలోనే మరోసారి భారత్‌కు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విషయాన్ని రష్యా ప్రతినిధి యూరీ ఉషకోవ్ వెల్లడించారు.
మొదట బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా దేశాలతో ఏర్పడిన బ్రిక్ కూటమిలో తరువాత దక్షిణాఫ్రికా చేరడంతో బ్రిక్స్‌గా మారింది. అనంతరం ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, యూఏఈ, ఇండోనేసియా వంటి దేశాలు చేరడంతో బ్రిక్స్ ప్లస్ ఏర్పడింది. సౌదీ అరేబియా, అర్జెంటీనా కూడా త్వరలో ఈ కూటమిలో చేరనున్నాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రధాని నరేంద్ర మోదీ తో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!