

సినీనటుడు విజయ్ 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు తమిళగ వెట్రి కళగం పార్టీని ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. పార్టీ సిద్ధాంతాలు ప్రకటించి ప్రజల్లోకి వెళ్లిన విజయ్, రాజకీయంగా బలమైన శక్తిగా ఎదుగుతున్నారు. అయితే ఈ ప్రయాణంలో పలు న్యాయపరమైన అడ్డంకులు ఎదురయ్యాయి. గతేడాది కరూర్‌లో జరిగిన టీవీకే రోడ్‌షోలో తొక్కిసలాటలో 41 మంది మరణించడంతో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. జనవరిలో విచారణకు విజయ్ రెండు సార్లు ఢిల్లీకి వెళ్లారు. అలాగే ‘జననాయగన్’ సినిమా సీబీఎఫ్సీ అభ్యంతరాలతో నిలిచిపోవడంతో మద్రాస్ హైకోర్టు వరకు వ్యవహారం వెళ్లింది. పార్టీ జెండాపై దాఖలైన కేసులో తాత్కాలికంగా అనుకూల ఉత్తర్వులు వచ్చినా తుది తీర్పు ఇంకా వెలువడాల్సి ఉంది.
ఇటీవల విజయ్ వ్యక్తిగత జీవితం కూడా రాజకీయ చర్చకు దారితీసింది. ఆయన భార్య సంగీత సోర్నలింగం చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానంలో విడాకుల పిటిషన్ దాఖలు చేయగా, ఏప్రిల్ 20న విచారణకు స్వీకరించారు. ఈ వ్యవహారం ఎన్నికల సమయంలో వెలుగులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు, నటి త్రిషా కృష్ణన్ స్పందనతో వివాదం చెలరేగింది. విజయ్ తండ్రి S. A. Chandrasekhar, తల్లి శోభ గతంలో సంగీతను పిల్లలకు అంకితభావంతో ఉండే తల్లిగా కొనియాడారు. 25 ఏళ్ల వివాహబంధం తరువాత విడాకుల వ్యవహారం తెరపైకి రావడం రాజకీయ ప్రభావం చూపుతుందా అనే చర్చ నడుస్తోంది.

.webp&w=3840&q=75)





.webp&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!