
రాజకీయాలు

తమిళనాడులో దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్రావిడ రాజకీయ సమీకరణాలు ఇప్పుడు అనూహ్యంగా మారుతున్నాయి. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) రాష్ట్ర రాజకీయాల్లో భారీ ప్రభంజనం సృష్టిస్తోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం అధికార డీఎంకేను సైతం వెనక్కి నెట్టి టీవీకే ముందంజలో నిలుస్తోందని విశ్లేషణలు చెబుతున్నాయి.
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, బీజేపీతో జతకట్టిన అన్నాడీఎంకే, మరియు తొలిసారి బరిలోకి దిగిన టీవీకే మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్‌లో డీఎంకేకు ఆధిక్యం చూపించినప్పటికీ, కొన్ని సర్వేలు ‘విజయ్ ఎఫెక్ట్’ బలంగా ఉందని పేర్కొంటున్నాయి. 234 సీట్లలో టీవీకే సుమారు 100 సీట్లు సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో విజయ్ కింగ్‌మేకర్‌గా మారే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!