

విద్యార్థులకు పాఠ్యాంశాల పై నాలెడ్జ్‌తో పాటు మంచి విలువలు కూడా ఎంతో అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రెండో రోజు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్ విద్య వరకు రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థల్లో కూడా ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని అమలు చేయాలని, దీనిని మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. విద్యారంగంలో ఈ కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.
‘ముస్తాబు’ పై సమగ్ర ప్రెజెంటేషన్ అందించిన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర రెడ్డి ని సీఎం అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని తెలిపారు.
అధికారులు నూతన ఆలోచనలతో కొత్త ఆవిష్కరణలు చేయాలని, అలాగే ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసాకు స్పష్టమైన ఫలితం కనిపించేలా చర్యలు ఉండాలని సీఎం సూచించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!