
రాజకీయాలు

అమెరికా అక్రమ వలసదారులకు ఒక కొత్త ఆఫర్ ప్రకటించింది. స్వచ్ఛందంగా దేశాన్ని విడిచి వెళితే వారికి 2,600 డాలర్లు ఇవ్వడంతో పాటు ఉచిత విమాన టికెట్లు కూడా అందిస్తామని తెలిపింది. ఈ నిర్ణయం వలస నిబంధనలను స్వచ్ఛందంగా పాటించేందుకు ప్రోత్సహించడానికేనని అధికారులు చెప్పారు.
ఈ సదుపాయాన్ని పొందాలనుకునే వారు కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ యాప్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. 2025 జనవరిలో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని ఇప్పటివరకు సుమారు 22 లక్షల మంది వినియోగించుకున్నారని సమాచారం. వలస వ్యవస్థను సులభతరం చేయడం, అమలు సమస్యలను తగ్గించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!