

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ చిత్రం ‘డ్రాగన్’ షూటింగ్‌కు తాత్కాలిక విరామం పడినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చిత్రీకరణ సమయంలో ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో వైద్యులు పరీక్షించి కొంతకాలం పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. దీంతో ఇప్పటికే సిద్ధం చేసిన తదుపరి షెడ్యూల్‌ను చిత్రబృందం వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విదేశాల్లో చిత్రీకరించాల్సిన కీలక సన్నివేశాల షూటింగ్ కూడా తాత్కాలికంగా నిలిపివేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
వైద్యుల సూచనల ప్రకారం ఎన్టీఆర్ 6 నుంచి 8 వారాల పాటు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాతే షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. శ్రీలంకలో జరగాల్సిన భారీ షెడ్యూల్‌ను వాయిదా వేసి కొత్త తేదీలపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్‌లో చిత్రీకరణ పునఃప్రారంభం కావచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మార్పులు సినిమా విడుదల తేదీపై ప్రభావం చూపవని చిత్రవర్గాలు పేర్కొంటున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!