
జనరల్

ఉదయనిధి స్టాలిన్ ను డీఎంకే శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన ఉదయనిధి స్టాలిన్ 17వ తమిళనాడు శాసనసభలో అధికారికంగా ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించనున్నారు. తమిళనాడు రాజకీయాల్లో ఇది కీలక పరిణామంగా భావిస్తున్నారు.
డీఎంకే శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఉదయనిధి స్టాలిన్‌కు మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వానికి అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షంగా నిలవడంలో ఉదయనిధి కీలక పాత్ర పోషిస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!