
బిజినెస్

రాబోయే శాసనసభ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న అంశంపై కసరత్తు కొనసాగుతోంది. ‘వి’ అక్షరంతో ప్రారంభమయ్యే నియోజకవర్గాలను పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. చెన్నైలోని వేళచ్చేరి, విరుగంబాక్కం, అలాగే విక్రవాండి, వేదారణ్యం, వేడసందూర్ నియోజకవర్గాలు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను దృష్టిలో ఉంచుకుని తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని చివరి వరకు రహస్యంగా ఉంచాలని విజయ్ భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇప్పటికే ఆయన పేరును ఖరారు చేయడంతో ఈ అంశంపై ఆసక్తి నెలకొంది. విరుగంబాక్కం వ్యక్తిగతంగా ప్రాధాన్యం కలిగిన ప్రాంతంగా భావించబడుతుండగా, వేళచ్చేరి పార్టీ కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. తుది నిర్ణయం ఎన్నికల ప్రకటన సమీపంలో వెలువడే అవకాశముంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!