
గాసిప్స్

TVK పార్టీ చీఫ్ విజయ్ ఈరోజు ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో హాజరుకానున్నారు. కరూర్ తొక్కిసలాట ఘటనపై విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ ఆయనకు ఆరు రోజుల క్రితం సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విజయ్ విచారణకు హాజరై పూర్తి స్థాయిలో సహకరిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
గతేడాది సెప్టెంబరులో కరూర్‌లో నిర్వహించిన ర్యాలీలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో 41 మంది మృతి చెందారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేయడంతో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో భాగంగా విజయ్ను విచారించనున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!