

రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గురువారం ఆయన ఆదేశాల మేరకు అమెరికా సైన్యం నైజీరియా ఈశాన్య ప్రాంతంలోని సొకోటో రాష్ట్రంలో ఐసిస్ ఉగ్రవాద స్థావరాల పై వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడులు నైజీరియా ప్రభుత్వ అభ్యర్థన మేరకు జరిగాయని అమెరికా వర్గాలు వెల్లడించాయి.
ఈ చర్యలను శక్తివంతమైన, ప్రాణాంతకమైన దాడులుగా అభివర్ణించిన ట్రంప్, అమాయక క్రైస్తవుల పై హింసకు పాల్పడుతున్న ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకున్నామని తెలిపారు. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ లో ఆయన స్పందిస్తూ, నైజీరియాలో క్రైస్తవుల అస్తిత్వానికి ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ ఆఫ్రికాలో క్రైస్తవ వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు హింస కొనసాగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
“మా సైనికులు అద్భుతంగా వ్యూహాలను అమలు చేశారు. ఇలాంటి ఆపరేషన్లు చేయగల సామర్థ్యం యునైటెడ్ స్టేట్స్కే ఉంది. నా నాయకత్వంలో రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదానికి చోటు ఉండదు. క్రైస్తవుల పై దాడులు కొనసాగితే మరింత కఠినంగా స్పందిస్తాం” అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చకు దారితీశాయి.
ఇదిలా ఉండగా, ఈ వైమానిక దాడులను యూఎస్ ఆఫ్రికా కమాండ్ అధికారికంగా ధృవీకరించింది. అయితే దాడుల్లో ఎంతమంది ఉగ్రవాదులు మరణించారన్న వివరాలను వెల్లడించలేదు. ఇటీవల నైజీరియాలో ఐసిస్ క్రైస్తవుల పై వరుసగా దాడులు చేసి భారీ ప్రాణనష్టం కలిగించిందని, ఆ నేపథ్యంలోనే నైజీరియా అభ్యర్థన పై ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
_1771477764226.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!