
క్రీడలు

ఇరాన్ అణు ఒప్పందాన్ని అమెరికా చేసుకున్న అత్యంత చెత్త ఒప్పందాల్లో ఒకటిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. ఒబామా హయాంలో అనుభవం లేని అధికారులు ఈ ఒప్పందాన్ని అమలు చేశారని విమర్శించిన ట్రంప్, అది ఇరాన్‌కు అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంపొందించుకునే అవకాశం కల్పించిందన్నారు.
ప్రస్తుతం ఇరాన్‌తో జరుగుతున్న చర్చల్లో అలాంటి తప్పిదాలు జరగవని ట్రంప్ స్పష్టం చేశారు. ఒప్పందం విషయంలో ఎలాంటి తొందరపడకుండా జాగ్రత్తగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. తుది ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకం చేసే వరకు హర్మూజ్ జలసంధి దిగ్బంధనం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో సహకరిస్తున్న పశ్చిమాసియా దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!