

నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ తన టీవీకే పార్టీతో తొలి ఎన్నికల్లోనే ఘన విజయాన్ని సాధించి తమిళనాడు రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారారు. అయితే ప్రజల మద్దతు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు విషయంలో ఎదురవుతున్న సవాళ్లపై విజయ్ మౌనంగా ఉండటం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. తమిళనాడులో నెలకొన్న రాజకీయ ఉత్కంఠ మధ్య విజయ్ తదుపరి అడుగు ఏంటన్న దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.
ఈ సమయంలో నటి త్రిష గతంలో విజయ్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్‌తో ఐదు సినిమాల్లో నటించిన త్రిష ఆయనను “సైలెంట్ కిల్లర్”గా అభివర్ణించింది. సెట్స్‌లో గంటల తరబడి ఎవరితో పెద్దగా మాట్లాడకుండా ప్రశాంతంగా కూర్చుంటాడని, కానీ అందరినీ ఆకర్షించే వ్యక్తిత్వం ఆయనదని చెప్పింది. తన జీవితంలో ఎప్పటికీ ఇష్టపడే వ్యక్తుల్లో విజయ్ ఒకరని, ఆయనతో ఉంటే ఎంతో భద్రతగా అనిపిస్తుందని త్రిష పేర్కొంది. ప్రస్తుతం రాజకీయ సంక్షోభ సమయంలో విజయ్ మౌనం వెనుక ఎలాంటి వ్యూహం ఉందోనని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!