
సినిమాలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో విద్యుత్ సంస్కరణలు, డిస్కంల నష్టాల తగ్గింపు, ఇంధన పొదుపు చర్యలు వంటి కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. జూన్ 2 నుంచి రైతు డిస్కం అమలు, సోలార్ పంప్సెట్ల ప్రోత్సాహంపై కూడా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
కొండారెడ్డిపల్లి తరహాలో మరిన్ని సోలార్ విలేజెస్ ఏర్పాటు, సోలార్ స్టౌ స్కీం అమలు, ప్రభుత్వ శాఖల్లో ఈవీల వినియోగంపై కూడా చర్చించనున్నారు. అదనంగా పంటల మార్పిడి కోసం రైతులకు యాక్షన్ ప్లాన్, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా విధివిధానాల ఖరారు, తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణపై కూడా సమావేశంలో చర్చ జరగనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!