

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఎంపీలు కీలక నిర్ణయం తీసుకున్నారు. సుమారు 20 మంది టీఎంసీ రెబల్ ఎంపీలు త్రిపురకు చెందిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ (ఎన్సీపీ)లో విలీనమవుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ను కలిసి అధికారిక లేఖ అందజేశారు. ఈ పరిణామం టీఎంసీ అంతర్గత రాజకీయాల్లో మరింత చర్చనీయాంశంగా మారింది.
రెబల్ వర్గానికి నాయకత్వం వహిస్తున్న కకోలి ఘోష్ దస్తిదార్ మీడియాతో మాట్లాడుతూ, తాము పార్లమెంటులో ప్రత్యేకంగా కూర్చుంటామని, ఎన్డీయేలో భాగస్వాములుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేస్తామని తెలిపారు. తమకు మూడింట రెండు వంతుల మద్దతు ఉందని పేర్కొన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి అనర్హత వేటు తప్పించుకునేందుకు ఈ విలీన నిర్ణయం వ్యూహాత్మకంగా తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!