

తెలంగాణ భవన్లో నిర్వహించిన కే. చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, ఇది ఒక నాయకుడి పుట్టినరోజు మాత్రమే కాకుండా ఉద్యమ ఆవిర్భావ దినమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో జీవించే స్థితికి రావడానికి కేసీఆర్ చేసిన పోరాటం, త్యాగాలు ప్రధాన కారణమని తెలిపారు. అన్యాయం, వివక్ష, ప్రాంతీయ గౌరవానికి జరిగిన దెబ్బల సమయంలో తెలంగాణ కోసం ధైర్యంగా ముందుకు వచ్చిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన అనేది పదవుల కోసం కాదు, త్యాగాల పునాదిపై సాధించిన విజయమని హరీశ్ రావు చెప్పారు. ముఖ్యమైన పదవులను కూడా త్యజించి ప్రజల ఆకాంక్ష కోసం కేసీఆర్ నిరంతరం పోరాడారని, ఎన్నో అవమానాలు, కుట్రలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా లక్ష్యాన్ని సాధించారని వివరించారు. ఆయన త్యాగం, ధైర్యం లేకపోతే తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేది కాదని అన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!